Balakrishna with Simran : బాలయ్యతో ముచ్చటగా మూడోసారి?

Balakrishna with Simran : నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Krishna
Published on: 30 Aug 2020 7:24 PM IST
Balakrishna with Simran : బాలయ్యతో ముచ్చటగా మూడోసారి?
X

Balakrishna 

Balakrishna with Simran : నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బాలయ్య సరసన ఒక హీరోయిన్ గా అంజలిని ఎంపిక చేసింది చిత్రబృందం.. అయితే మరో పాత్రకి గాను సీనియర్ నటి సిమ్రాన్ ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పాత్ర సినిమాలో కీలకం కానుందని సమాచారం. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపైన చిత్రబృందం స్పందించేవరకు ఆగాల్సిందే.. ఇక సిమ్రాన్, బాలకృష్ణ కాంబినేషన్ లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు వచ్చాయి.. ఈ సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి..

ఇక దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న బాలయ్య, బోయపాటి సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి.. 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ఫిలింనగర్ లో న్యూస్ వినిపించింది.. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉంది.. ఇక ఎలాగు బాలయ్యకి సంక్రాంతి హీరోగా మంచి పేరున్న సంగతి తెలిసిందే..

Krishna

Krishna

Next Story