Rowdy Boys Movie Trailer Talk: రెగ్యులర్ ఎంటర్టైనర్గా ఆశిష్ మొదటి సినిమా

Hero Ashishs Rowdy Boys Movie Trailer Talk | Tollywood News Online
x

రెగ్యులర్ ఎంటర్టైనర్గా ఆశిష్ మొదటి సినిమా

Highlights

Rowdy Boys Movie Trailer Talk: రెగ్యులర్ ఎంటర్టైనర్గా ఆశిష్ మొదటి సినిమా

Rowdy Boys Movie Trailer Talk: ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ "రౌడీ బాయ్స్" అనే సినిమాతో త్వరలో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. కాలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. టీజర్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రానప్పటికీ ఈ ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఒక మెడికల్ స్టూడెంట్ తో ప్రేమలో పడే ఒక ఆకతాయి గా కనిపించబోతున్నాడు ఆశిష్.

ఇతనికి మరియు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న మరోకతనికి మధ్య జరిగే కథ, ఫైటింగ్ ఈ సినిమా. ఇంతకీ ఇద్దరూ పోటీపడి మరీ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి పాత్ర పోషించింది అనుపమ పరమేశ్వరన్. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందో ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఒక రెగ్యులర్ ఎంటర్టైనర్ సినిమాగా అనిపిస్తోంది. కానీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరియు మధి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అని చెప్పుకోవచ్చు. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories