Allu Arjun: మంచు లక్ష్మిపై జోకేసిన స్టైలిష్ స్టార్

Allu Arjun: ప్రెసిడెంట్ గారి అక్కయ్య అంటూ చమత్కరించిన బన్నీ

admin1
Updated on: 4 Nov 2021 11:33 AM IST
Hero Allu Arjun Joke on manchu Lakshmi
X

మంచు లక్ష్మి పై జోక్ వేసిన అల్లు అర్జున్ (ఫైల్ ఇమేజ్)

Allu Arjun: గత కొంతకాలంగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు ఎన్నడూ అల్లు అర్జున్ ఎలక్షన్ల గురించి మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు స్వయంగా మా ఎన్నికల గురించి కామెంట్లు చేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య జరిగిన మా ఎన్నికల్లో మా అసోసియేషన్ కి కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు మంచు విష్ణు. తాజాగా ఆహా 2. ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లుఅర్జున్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేశారు. మంచు లక్ష్మి ఆహా లో ఒక కుకింగ్ షో కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె కూడా ఆ ఈవెంట్ కి విచ్చేశారు.

అల్లు అర్జున్ ను లక్ష్మి స్టేజ్ పైకి గెలవగా బన్నీ ఆమె ని తెలుగులో మాట్లాడమని కోరారు. "ఆహా తో నా బంధం ఎప్పటిదో. నేను వారి యాంకర్ గా మారిపోయాను. అందుకే ఈ వేడుకకి గెస్ట్ గా కూడా వచ్చాను" అని మంచు లక్ష్మి అన్నారు. అయితే అల్లు అర్జున్ కలగజేసుకుని "ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ గారి అక్క కూడా అయ్యారు" అని చమత్కరించారు. దీంతో అందరూ నవ్వేశారు. "ప్రెసిడెంట్ గారి అక్క అవడం వల్ల నేను కూడా కొన్ని ఇబ్బందుల్లో పడుతున్నాను" అని మంచు లక్ష్మి కూడా నవ్వుతూ అన్నారు. ఈ జోక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా మెగా ఫామిలీ మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి మద్దతు పలికింది. కానీ ఇప్పుడు బన్నీ ఈ విషయంపై మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.

admin1

admin1

Next Story