Koratala-Bunny Combination: ఆఫీషియల్ : కొరటాలతో బన్నీ!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొద్దిరోజులుగా ప్రచారం

Krishna
Updated on: 31 July 2020 2:00 PM IST
Koratala-Bunny Combination: ఆఫీషియల్ : కొరటాలతో బన్నీ!
X
Koratala siva, Allu arjun( File Photo)

Koratala-Bunny Combination: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొద్దిరోజులుగా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నేడు అధికారికంగా ప్రకటించింది. #AA21 విత్ కొరటాల శివ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాకి నిర్మాత కాగా, యువసుధ, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మల్టిపుల్ లాంగ్వేజీలలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్వరలో సినిమాకి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయన్నున్నారు. ఇక బన్నీతో కొరటాల మూవీ అంటే టాలీవుడ్ లో ఇప్పటినుంచే అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇది కొరటాలకి ఆరో సినిమా కాగా, అల్లు అర్జున్ కీ 21 వ చిత్రం..




ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది..

అటు కొరటాల ప్రస్తుతం ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి సినిమా విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Krishna

Krishna

Next Story