బన్నీని కలవాడడానికి 200 కిలోమీటర్లు నడుచుకుంటూ.. అభిమానికి స్టైలిష్ స్టార్ సర్‌ప్రైజ్

బన్నీని కలవాడడానికి  200 కిలోమీటర్లు నడుచుకుంటూ.. అభిమానికి స్టైలిష్ స్టార్ సర్‌ప్రైజ్
x
Highlights

Allu Arjun Fan : హీరోలంటే చాలా మంది ఫ్యాన్స్‌కు పిచ్చి.. తమ అభిమాన నటుడు కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతుంటారు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసేందుకు మంచిర్యాల నుంచి హైదరాబాదుకు దాదాపు 200 కిలోమీటర్లు నడుచుకుంటూ నాగేశ్వరరావు అనే ఓ అభిమాని వచ్చాడు.

Allu Arjun Fan : హీరోలంటే చాలా మంది ఫ్యాన్స్‌కు పిచ్చి.. తమ అభిమాన నటుడు కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతుంటారు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసేందుకు మంచిర్యాల నుంచి హైదరాబాదుకు దాదాపు 200 కిలోమీటర్లు నడుచుకుంటూ నాగేశ్వరరావు అనే ఓ అభిమాని వచ్చాడు. అయితే ఈ విషయాన్ని తన టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంట‌నే త‌న‌ని ఆపి హైద‌రాబాద్ కి తీసుకురమ్మని చెప్పాడు.. వారం రోజులుగా అతని ఆచూకీ గురించి వెతకగా నిన్న సాయంత్రం అతన్ని అల్లు అర్జున్ కి కల్పించారు. అనంతరం బన్నీ అతనితో మాట్లాడారు..

ఈ క్రమంలో తన అభిమాని నాగేశ్వరరావును క‌లిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు బన్నీ.. గంగోత్రి సినిమా నుంచి తనకి మీరు (అల్లు అర్జున్) అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు నాగేశ్వరరావు.. అయితే మిమల్నీ కలుసుకునేందుకు రోజుకు 35 కిలోమీట‌ర్ల నుండి 40 కిలొమీట‌ర్లు న‌డిచానని చెప్పడంతో బన్నీ ఒక్కసారిగా క‌ళ్ళు చేమర్చారు.. అయితే ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమౌతుంది అని బన్నీ అడగగా, తానూ మీకు పెద్ద ఫ్యాన్ అని, మీ సినిమాల అన్నీ ఫంక్షన్ లకు హాజరైనట్టుగా చెప్పుకొచ్చాడు.. మిమ్మల్ని క‌ల‌వ‌టమే ధ్యేయంగా పెట్టుకొని తమ ఊరి నుండి తన ప్రయాణం మొదలు పెట్టినట్టుగా నాగేశ్వరరావు వెల్లడించాడు.

ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తన మీదా ఉన్న అభిమానానికి చాలా ధన్యవాదాలు అని అన్నాడు. కానీ ఇలా నడుచుకుంటూ రావడం చాలా బాధగా ఉందని అన్నారు. ఇలాంటివి నీ భ‌విష్యత్తు కోసమో, మీ ఫ్యామిలి కోస‌మో చేస్తే ఇంకా గర్వంగా ఫీల్ అవుతానని, ఇంకెప్పుడు ఇలాంటివి చేయొద్దని తన అభిమానికి చెప్పాడు బన్నీ.. త‌న అభిమానికి గుర్తుగా ఒక మొక్కని గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. అనంతరం తన అభిమానితో ఫోటో దిగి సొంత ఖర్చులతో ఇంటికి పంపించాడు బన్నీ...

Show Full Article
Print Article
Next Story
More Stories