Adivi Sesh - Major Movie: ఆయన ఫ్యాన్ గా మిగిలిపోతాను అంటున్న అడవి శేష్

Hero Adivi Sesh Says Iam big fan of Major Sandeep Unnikrishnan
x

Adivi Sesh: ఆయన ఫ్యాన్ గా మిగిలిపోతాను అంటున్నా అడవి శేష్

Highlights

* పాపులర్ నటుడు అడవి శేష్ తాజాగా ఇప్పుడు "మేజర్" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Adivi Sesh - Major Movie: పాపులర్ నటుడు అడవి శేష్ తాజాగా ఇప్పుడు "మేజర్" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2008 ముంబై ఎటాక్స్ లో మృతి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో అడవి శేష్ కొన్నాళ్లపాటు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశాడు.

తాజాగా ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాడు శేష్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆకరి స్టేజ్లో ఉంది. "మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నా ప్రయాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ షెడ్యూల్ తర్వాత నేను ఆయనను అర్థం చేసుకున్న ఒక ఫ్యాన్ గా మిగిలిపోతాను. ఇకపై నాలో నేనే మేజర్ సందీప్ ని వెతుక్కునే ఫ్యాన్ గా ఉంటాను" అని ట్వీట్ చేశారు అడివి శేష్.

ఈ సినిమా స్క్రిప్ట్ రైటర్ లలో అడవి శేష్ కూడా ఒకరు. స్వయంగా సందీప్ ఉన్నికృష్ణన్ వాళ్ల తలిదండ్రులను కలిసి స్క్రిప్ట్ ను డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి ఎమోషనల్ గా కూడా చాలా కనెక్ట్ అయ్యారు శేష్. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుండడంతో సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్, జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా మలయాళంలో కూడా డబ్ అవ్వనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories