వరస ఫెయిల్యూర్లు.. కానీ వరుస సినిమాలు

వరస ఫెయిల్యూర్లు.. కానీ వరుస సినిమాలు
x
Aadi ( File photo)
Highlights

హీరో సాయి కుమార్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది. ప్రేమ కావాలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమాలో ఆది ఇటు ఫైట్స్ లోను,...

హీరో సాయి కుమార్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది. ప్రేమ కావాలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమాలో ఆది ఇటు ఫైట్స్ లోను, డాన్స్ లోను, నటనలోనూ మెప్పించాడు. ఆ తర్వాత లవ్లీ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అది చేస్తున్న ఎ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. చివరగా వచ్చిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా ఫ్లాప్ ని మూటగట్టుకుంది.

ఇలా వరస ఫెయిల్యూర్లు వచ్చినప్పటికీ కూడా అది వీటిని కేర్ చేయకుండా సినిమాలని చేసుకుంటూ పోతున్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే ఎవరైనా మంచి కథ కోసం ఎదురుచూసి సినిమాలు చేస్తుంటారు. కానీ ఆది అలా కాకుండా సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు. ఈ క్రమంలో మరో రెండో సినిమాలకు సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చింది. నిన్న ఆది పుట్టిన రోజు సందర్భంగా ఆదికి సంబంధించిన సినిమాలను అనౌన్స్ చేశారు.

అందులో పూరీ జగన్నాథ్ శిష్యుడు జి.బి.కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నాడు. సస్పెన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కతుందని సమాచారం. ఈ సినిమాకి మహంకాళీ దివాకర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా అదే కాకుండా ఆది 'శశి' అనే ఓ సినిమాని చేస్తున్నాడు. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సురభి, రాశీ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలు ఆదికి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories