Pawan Kalyan: సాయి పల్లవి ప్లేస్‌లో నిత్యామీనన్ ఎందుకొచ్చింది? కారణం ఇదే..!

Pawan Kalyan: సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది

Venkata Chari
Updated on: 4 May 2021 10:22 PM IST
Here is why Nithya Menon replaced Sai Pallavi
X

నిత్యా మీనన్ & సైపల్లవి 

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయ్యప్పనమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ లో వీరిద్దరు నటించబోతున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదరుచూస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేసేందుకు మేకర్స్ మొదట సాయి పల్లవిని అనుకున్నారంట. అయితే తాజా నివేదికల ప్రకారం నిత్యా మీనన్ ఈ బోర్డులో చేరినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి స్థానంలో నిత్యా వచ్చి చేరిందని టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ సాయి పల్లవి డిమాండ్ ను పక్కన పెట్టి, నిత్యామీనన్ ను సంప్రదించారని తెలుస్తోంది.

సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్‌తో తక్కువ రెమ్యునరేషన్‌తో నటించేందుకు అంగీకరించారంట. దీంతో నిత్యామీనన్ ప్రస్తుతం పవన్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. కరోనా వైరస్ నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకున్న వెంటనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.

Venkata Chari

Venkata Chari

Next Story