Salaar: "సలార్" లో ప్రభాస్ పాత్ర అదేనా?

Here is the Role Prabhas Likely to Portray in Salaar
x

Salaar: "సలార్" లో ప్రభాస్ పాత్ర అదేనా?

Highlights

"కేజిఎఫ్" పాత్ర "సలార్" లో కూడా ఉంటుందా?

Salaar: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "సలార్". భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేజిఎఫ్ 2 సినిమాలో కనిపించిన ఫర్మాన్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కేజిఎఫ్ 2 సినిమాలో ఫర్మాన్ మరియు ఫర్మాన్ తల్లి ఫాతిమా (ఈశ్వరి రావు) పాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అవే పాత్రలు ఇప్పుడు సలార్లో కూడా ఉండబోతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ దేవా అనే ఒక పాత్రలో కనిపించబోతున్నారట. కరడు కట్టిన క్రిమినల్స్ కూడా దేవా అమానుషత్వానికి గజగజ వణుకుతారు అని తెలుస్తోంది.

కానీ కేజిఎఫ్ ఫ్రాంచైజీలో ఇలాంటి పాత్ర ఏదీ లేదు. కాబట్టి ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ వేరే కథని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బసూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories