Movie News: ఆ రెండు సినిమా క‌థ‌లూ ఒక్క‌టేనా?

Movie News: టాలీవుడ్ లో త్వరలో రెండో సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

Arun Chilukuri
Updated on: 16 Sept 2022 12:00 PM IST
Here are Two Telugu Films With Same Concept
X

Movie News: ఆ రెండు సినిమా క‌థ‌లూ ఒక్క‌టేనా?

Movie News: టాలీవుడ్ లో త్వరలో రెండో సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఒకటి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న "బేబీ" సినిమా కాగా మరొకటి "బుట్ట బొమ్మ". బేబీ సినిమాకి మారుతి కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను ప్రేమిస్తుంది. అందులో ఒకడు మంచివాడు కానీ మరొకడు చెడ్డవాడు. ఈ నేపథ్యంలో సినిమా కథ సాగుతూ ఉంటుంది.

అయితే మరోవైపు బుట్ట బొమ్మ సినిమా కూడా దాదాపు ఇదే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇది కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కనుంది. అందులో ఒక‌డు మంచోడు. మ‌రొక‌డు చెడ్డోడు. సేమ్‌.. `బుట్టబొమ్మ‌` క‌థ కూడా ఇంతే. మ‌ల‌యాళ చిత్రం క‌ప్పెల‌కి ఇది రీమేక్‌. ఇది కూడా ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీనే. క‌ప్పెల‌లో ఉన్న గ‌మ్మ‌త్తేమిటంటే.. స్క్రీన్‌ని విల‌న్ గా క‌నిపించే వాడు.. హీరో. అప్ప‌టి వ‌ర‌కూ హీరోగా క‌నిపించిన‌వాడు క్లైమాక్స్‌లో విల‌న్ అవుతాడు.

మలయాళం లో హిట్ అయిన కప్పెలా అనే సినిమాకి రీమేక్ గా "బుట్ట బొమ్మ" ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇక ఈ రెండు సినిమాలలో ఏది ముందు విడుదల అవుతుంది అనేది మెయిన్ పాయింట్. ఒకవేళ బేబీ సినిమా ముందు వస్తే, బుట్ట బొమ్మ సినిమాని అందరూ కాపీ అనే అవకాశం ఉంది. కానీ చూస్తుంటే బేబీ కంటే ముందు బుట్ట బొమ్మ విడుదల అయ్యేలాగా కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story