'ఆర్ఆర్ఆర్‌'లోని కొమ్మ ఉయ్యాల‌.. అంటూ పాట పాడిన గాయ‌ని ఎవ‌రో తెలుసా?

RRR Movie: భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ని తిరగరాస్తోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌, ఫిక్షనల్‌ డ్రామా ఆర్‌ఆర్‌ఆర్‌.

Arun Chilukuri
Updated on: 1 April 2022 4:00 PM IST
Here are the Details of RRR Movie Singer Prakruthi Reddy
X

‘ఆర్ఆర్ఆర్‌’లోని కొమ్మ ఉయ్యాల‌.. అంటూ పాట పాడిన గాయ‌ని ఎవ‌రో తెలుసా?

RRR Movie: భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ని తిరగరాస్తోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌, ఫిక్షనల్‌ డ్రామా ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌, తారక్‌ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మల్లి పాత్ర గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లి పాత్రతో మొదలు కావడం… సినిమా మొత్తం మల్లి అనే పాత్ర పైనే ఆధారపడి ఉంటుంది.

సినిమా ప్రారంభం మల్లి పాత్రతో మొదలవుతుంది. ఈ గిరిజన బాలిక పాడే కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాల అనే పాటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ గాత్రం సంగీత ప్రియులను అలరించింది. ఈ లిరికల్ సాంగ్ విడుదల చేసే ప్రయత్నంలో ఉంది చిత్ర యూనిట్. సినీ ప్రియులను ఇంతగా ఆకట్టుకున్న ఈ పాటను పాడింది కర్ణాటకకు చెందిన ప్రకృతి రెడ్డి. చిన్నతనం నుంచి సంగీతం అంటే ఇష్టమున్న ఆమెకు తల్లిదండ్రులు సంప్రదాయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క సంగీత పోటీల్లోనూ పాల్గొంటూ తన ప్రతిభను చాటిచెప్పింది ప్రకృతి. బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాల్లోనూ పాల్గొని తన గాత్రంతో జడ్జిలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. కన్నడలోనే కాకుండా.. తెలుగు, తమిళం, హిందీలోనూ పాటలు పాడడం నేర్చుకుంది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story