సమంత ఇంకా విడాకులు తీసుకోకుండానే.. సమంతపై దుష్ప్రచారం చేశారు: సమంత లాయర్

Samantha: రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టు * 3 యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువున

admin1
Updated on: 28 Oct 2021 2:21 PM IST
Samantha Court Hearings Ended in Kukatpally
X

కూకట్పల్లి కోర్ట్ లో ముగిసిన సమంత పిటిషన్ వాదనలు (ఫైల్ ఇమేజ్)

Samantha: హీరోయిన్ సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. సమంత వేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. 3 యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా వేసింది. వాదనల సందర్భంగా కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పరువు నష్టం దావా వేసే బదులు వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని ప్రశ్నించింది.

సెలబ్రిటీలు వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే. పరువుకు నష్టం, భంగం కలిగింది అనేది వారే కదా అని వ్యాఖ్యలు చేసింది. అయితే సమంత ఇంకా విడాకులు తీసుకోకుండానే సమంతపై దుష్ప్రచారం చేశారని సమంత తరపు లాయర్ వాదించారు. సమంతను టార్గెట్ చేసి వార్తలు రాశారన్నారు. తప్పుడు వార్తలు రాసిన వారికి పర్మినెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని సమంత తరపు న్యాయవాది కోర్టును కోరారు. రేపు కూకట్‌పల్లి కోర్టు తీర్పును వెల్లడించనుంది.

admin1

admin1

Next Story