Harry Potter: సినీ పరిశ్రమలో విషాదం.. హ్యారీపోటర్ నటుడు పాల్ గ్రాంట్ హఠాన్మరణం

Harry Potter: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పాల్ గ్రాంట్

Jyothi
Published on: 21 March 2023 12:58 PM IST
Harry Potter Fame Paul Grant Passed Away
X

Harry Potter: సినీ పరిశ్రమలో విషాదం.. హ్యారీపోటర్ నటుడు పాల్ గ్రాంట్ హఠాన్మరణం

Harry Potter: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు హ్యారీపోటర్‌ ఫేం పాల్‌ గ్రాంట్‌ కన్నుమూశారు. బ్రిటిష్‌ నటుడైన పాల్‌ గ్రాంట్‌ లండన్‌లోని యాస్టర్‌ రోడ్‌ సెయింట్‌ పాంక్రస్‌ స్టేషన్‌లో ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చెర్పించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాల్ మృతిపై పలువురు హాలీవుడ్‌ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

పాల్‌ గ్రాంట్‌ 1980లో విల్లో, లైబరన్త్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో హ్యారీపోటర్, స్టార్ వార్స్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. పాల్‌కు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ కారణంగా మరగుజ్జులా ఉండిపోయాడు. ఈ కారణంగా ఇతడికి పలు అనారోగ్య సమస్యల కూడా వచ్చేవి. 2014లో పాల్ కొకైన్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

Jyothi

Jyothi

Next Story