డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టనున్న హరీష్ శంకర్

Harish Shankar To Enter Digital Platform
x

డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టనున్న హరీష్ శంకర్

Highlights

Harish Shankar: డిజిటల్ ప్రపంచంలో అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్

Harish Shankar: ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. "ఏటీఎం" అనే వెబ్ సిరీస్ తో శంకర్ డిజిటల్ స్పేస్ లోకి తన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాబరీ బాక్ డ్రాప్ తో నడిచే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూజ ఈవెంట్ ఈ మధ్యనే జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ "డిజిటల్ వరల్డ్ లో నా కొత్త ప్రయాణాన్ని ఇవాళ మొదలుపెట్టాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి" అంటూ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు హరీష్ శంకర్. బిగ్ బాస్ 5 విన్నర్ సన్ని మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి ఈ వెబ్ సిరీస్ లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సి చంద్రమోహన్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించారు. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఈ సినిమాతో నిర్మాణంలో అడుగుపెట్టబోతోంది. గత 23 ఏళ్లుగా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తన తండ్రి నిర్మించిన సినిమాలు చూసిన హాన్షిత ఇప్పుడు నిర్మాతగా మారబోతోంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 27 నుండి మొదలు కాబోతోంది. జీ 5 వారు ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories