మీరు గీత దాటారు.. పవన్ ఫ్యాన్స్ పై హరీష్ శంకర్ సీరియస్..

Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

Arun Chilukuri
Updated on: 30 Jan 2023 12:34 PM IST
Harish Shankar Serious on Pawan Kalyan Fans
X

మీరు గీత దాటారు.. పవన్ ఫాన్స్ పై హరీష్ శంకర్ సీరియస్..

Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా. "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఇవ్వమని డైరెక్టర్ హరీష్ శంకర్ ను సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుతున్నారు.

అయితే గత కొంతకాలంగా ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "తేరీ" సినిమాకి రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ హీరోగా నటించిన తేరీ సినిమాని తెలుగులో అందరూ చూసేసారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా అనేది రీమిక్స్ చేయడం ఏమాత్రం బాగోలేదని మెగా అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో హరీష్ శంకర్ ని తెగ ట్రోల్ కూడా చేస్తున్నారు. దీంతో కోపం తెచ్చుకున్న హరీష్ శంకర్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇచ్చేది లేదు అని కరాకండిగా చెప్పేశారు.

"ఈ సినిమా రీమేకా కాదా అని వెండితెర మీద మాత్రమే చూడాలి. ప్రతిసారి నా ఆనందాన్ని అభిమానులతో పంచుకునే వాడిని. కానీ మొన్న ఫాన్స్ అతి చేశారు. నిజానికి నేను ఈ సినిమా రీమేకా కాదా అని చెప్పాలనుకున్నాను. ఈ సినిమా ఎందుకు తీస్తున్నాం ఆ సినిమా ఎందుకు చేయట్లేదు అని క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. కానీ ఫ్యాన్స్ టూ మచ్ గా బిహేవ్ చేశారు. ఇకపై నేను ఎలాంటి అప్డేట్ చెప్పాలనుకోవడం లేదు. మేము అనుకున్నట్టు సమయానికి షూటింగ్ మొదలుపెడితే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేస్తాం," అని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story