Harish Shankar: పవన్ కళ్యాణ్ కి నో చెప్పిన హరీష్ శంకర్

Harish Shankar: రీమేక్ సినిమాలు వద్దు అంటున్న హరీష్ శంకర్

Rama Rao
Updated on: 26 May 2022 2:15 PM IST
Harish Shankar Says No To Remake Movies | Telugu Movie News
X

రీమేక్ సినిమాలు వద్దు అంటున్న హరీష్ శంకర్

Harish Shankar: "గబ్బర్ సింగ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చాలా వరకు సినిమాలు అన్ని రీమేక్ సినిమాలు. పరభాష లో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్స్ అందుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం ఇప్పుడు రీమేక్ సినిమాలు చేయడానికి నిరాకరిస్తున్నారట.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య రీమేక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. "వకీల్ సాబ్", "భీమ్లా నాయక్" సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలని రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఆ సినిమాలకోసం సినిమాలకి దర్శకత్వం వహించమని హరీష్ శంకర్ ను అడగగా ఈ డైరెక్టర్ మాత్రం సింపుల్ గా నో చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో చేసే సినిమాకు కథ తన సొంత కథ అయితే బాగుంటుందని హరీష్ శంకర్ భావించారట.

అందుకే ఈ రీమేక్ సినిమాలు వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టుని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో "భవదీయుడు భగత్ సింగ్" అనే టైటిల్ తో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story