పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయడం ఇష్టమే కానీ..

Ruthvik
Published on: 4 May 2019 4:45 PM IST
పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయడం ఇష్టమే కానీ..
X

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సంబందించిన నిర్మాణ కార్యక్రమాల్లో బిజీ గా గడుపుతున్నారు. అయితే ఇటీవలే మీడియా లో ఆయన మీద, ఆయన సినిమా ల మీద పుకార్లు వస్తున్న తరుణం లో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. "ప్రస్తుతం నాకు సంబందించిన రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి నేను భాద్యత గా ఫీల్ అవుతూ క్లారిటీ ఇవ్వాలని ఉదేశ్యం తో నేను ట్వీట్ చేస్తున్నా.

మొదటగా పూజ హెగ్డే పారితోషికం విషయమై వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఇక రెండో దాని విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడం ఏ రోజైనా ఇష్టమే కానీ మేము ఇద్దరం ఇటీవలే కలిసాము అని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు. అందుకే సినిమా ప్రేక్షకులు అందరినీ ఈ వార్తలు నమ్మదు అని, నా నుండి కానీ నిర్మాణ సంస్థల నుండి మాత్రం వచ్చే అధికారిక ప్రకటనల కోసం వేచి చూడండి అని మనవి చేసుకుంటున్నా." అని హరీష్ శంకర్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం తాను జిగర్తాండా రీమేక్ ని తెలుగు లో వాల్మీకి గా వరుణ్ తేజ్ ని పెట్టి తీస్తున్నాడు.

Ruthvik

Ruthvik

Next Story