Bheemla Nayak: బావా.. నీ కెరీర్‌లోనే 'ది బెస్ట్'.. భీమ్లానాయక్‌పై హరీష్ శంకర్

Bheemla Nayak: పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.

Arun Chilukuri
Updated on: 25 Feb 2022 5:30 PM IST
Harish Shankar Review on Bheemla Nayak
X

Bheemla Nayak: బావా.. నీ కెరీర్‌లోనే 'ది బెస్ట్'.. భీమ్లానాయక్‌పై హరీష్ శంకర్

Bheemla Nayak: పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భీమ్లా నాయక్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ భీమ్లా నాయక్‌ థియేటర్లలోకి వచ్చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్‌ సందడి మాములుగా లేదు. ఉదయం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

పవన్‌తో గబ్బర్ సింగ్ చేసి హిట్ కొట్టిన దర్శకుడు హరీష్ శంకర్.. భీమ్లానాయక్‌పై రివ్యూ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత థియేటర్లలో పవన్ హవా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కామెంట్ చేశారు. ప్ర‌త్యేకించి థ‌మ‌న్ బావ‌…ఇది నీ కెరీర్‌లో బెస్ట్ వ‌ర్క్‌. ప్ర‌తీ స‌న్నివేశాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేశా. నువ్వు సీన్‌ను అర్థం చేసుకునే విధానం అద్బుతం. ఇది కేవ‌లం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్ర‌మే కాదు..భీమ్లా బ్యాక్ బోన్ (వెన్నెముక‌)..గ‌ర్వంగా ఉంది బావ' అంటూ ట్వీట్ చేశాడు హ‌రీష్ శంక‌ర్‌.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story