Ustaad Bhagat Singh: పవన్ మీద ప్రెజర్ పెంచే పనిలో హరీష్ శంకర్?

Ustaad Bhagat Singh: పవన్ మీద ప్రెజర్ పెంచే పనిలో హరీష్ శంకర్?

Arun Chilukuri
Updated on: 4 Aug 2023 9:00 PM IST
Harish Shankar Puts Pressure on Pawan
X

Ustaad Bhagat Singh: పవన్ మీద ప్రెజర్ పెంచే పనిలో హరీష్ శంకర్?  

Ustaad Bhagat Singh: సంక్రాంతి సందడి ఈ సారి కష్టమే అన్నారు. ప్రాజెక్ట్ కే పక్కకు పోయింది. ఓజీ సమ్మర్ కే వస్తోంది... ఇక గుంటూరు కారం కూడా షూటింగ్ డిలే వల్ల కష్టమే అన్నారు. కట్ చేస్తే, ఊహించని సినిమా సీన్లోకి వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మీద చర్చ మొదలైంది.. ఇది నిజమా? కావాలని క్రియేట్ చేస్తున్న హంగామా ?

బ్రో పంచ్ తో డీలా పడ్డ ఫిల్మ్ టీం సంగతి ఎలా ఉన్నా, పవన్ మీద వస్తున్న కొత్త రూమర్ ఫ్యాన్స్ ని డైలామాలో పడేస్తోంది. అదే పొంగల్ పోరులో పవర్ స్టార్ సినిమా... అదెలా సాధ్యమనే ప్రశ్నే చిక్కుముడిని మరింత చిక్కుల్లోకి నెడుతోంది. నిజానికి 2024 సంక్రాంతికి సీన్ లో ఉండేది గుంటూరు కారం మాత్రమే అన్నారు. కాని పవన్ సినమా మహేశ్ మూవీకి పోటీ అనేలోపు లెక్కలు మారాయి. పవన్ మూవీ పక్కకు పోతే గుంటూరు కారమే మిగిలి ఉంటుందన్నారు.

సరే సంక్రాంతికి లిస్ట్ లోంచి ప్రాజెక్ట్ కే పక్కకు పోయింది. కాబట్టి ఇక గుంటూరు కారమే సోలోగా సందడి చేస్తుందటే, త్రివిక్రమ్ షూటింగ్ ని డిలే చేస్తుండటంతో, ఇది కూడా ప్రాజెక్ట్ కే లా వేసవినే చూసుకోవాలనేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ తో శంకర్ తీసే సినిమా గేమ్ ఛేంజర్ ని సంక్రాంతికి ప్లాన్ చేశారు. తర్వాత భారతీయుడు 2 ని పొంగల్ కి ప్లాన్ చేశారు. అలాని అదే అప్లై చేస్తారా అంటే, అదీలేదు. పొంగల్ కి ఇదిరావట్లేదు, చెర్రీ గేమ్ ఛేంజర్ వచ్చేలా లేదు.

గుంటూరు కారమే అతికష్టం మీద సంక్రాంతికి బరిలోకి దిగే అవకాశం ఉందనుకుంటే, ఇంతలో పవన్ సినిమా మీద గుసగుసలు పెరిగాయి. 60 శాతం పూర్తైన ఓజీ సంక్రాంతికి రాదట కాని, ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందట. అక్కడే డౌట్లు పెరిగాయి. పవన్ మీద ప్రెజర్ పెంచేందుకు హరీష్ శంకర్ టీం వదిలిన ఫీలర్ ఇదంటూ గుసగుసలు పెరిగాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story