బన్నీ పై కన్నేసిన పవన్ కళ్యాణ్ డైరెక్టర్

Harish Shankar is Planning a Movie with Allu Arjun
x

 బన్నీ పై కన్నేసిన పవన్ కళ్యాణ్ డైరెక్టర్

Highlights

Harish Shankar: బన్నీ పై కన్నేసిన పవన్ కళ్యాణ్ డైరెక్టర్

Harish Shankar: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన సినిమా "డీజే దువ్వాడ జగన్నాథం". పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తి కాగా హరీష్ శంకర్ అల్లు అర్జున్ ను కలిశారు. అయితే హరీష్ శంకర్ ఇప్పుడు అల్లు అర్జున్ తో మరొక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "భవదీయుడు భగత్ సింగ్" సినిమా తీయాల్సి ఉంది కానీ ప్రస్తుతం తన రాజకీయ పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు. 2024 ఎలక్షన్ ల తర్వాతే ఈ సినిమా పట్టలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ ఒక స్టార్ హీరో తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

అల్లు అర్జున్ మాత్రం తన పూర్తి ఫోకస్ "పుష్ప" పైనే పెట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కనుంది. పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో "పుష్ప: ది రూల్" పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ అల్లు అర్జున్ కు ఒక రెండు మూడు కథ ఐడియాలను చెప్పినట్టు తెలుస్తోంది. మరి "పుష్ప 2" తర్వాత హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories