Trivikram Srinivas - Harish Shankar: త్రివిక్రమ్ గురించి క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

Trivikram Srinivas - Harish Shankar: అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరీష్ శంకర్ ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు...

admin1
Published on: 17 March 2022 1:05 PM IST
Harish Shankar Gives Clarity on Trivikram Srinivas Issue | Tollywood News
X

Trivikram Srinivas - Harish Shankar: త్రివిక్రమ్ గురించి క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

Trivikram Srinivas - Harish Shankar: వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిత్వరలోనే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. అయితే తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై పనిచేయదని పవన్ కళ్యాణ్ కు చెబుతున్నట్లు తెలుస్తోంది.

కానీ హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ సినిమానీ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ సినిమాకి త్రివిక్రమ్ పెద్ద అడ్డంకిగా మారారు అని తెలుస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరీష్ శంకర్ ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు. ఈ పుకార్లలో ఏ మాత్రం నిజం లేదని, ఏ పెద్ద డైరెక్టర్ తన సినిమాకి అడ్డుగా రావడం లేదని అన్నారు.

కొన్ని ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు కేవలం సరదాకి ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు అని ఈ చిత్ర షూటింగ్ అతి తొందరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందట.

admin1

admin1

Next Story