పవన్ కళ్యాణ్ వల్ల ఫ్రస్ట్రేట్ అవుతున్న హరీష్ శంకర్..

Harish Shankar: తన ఐడియా లను హరీష్ శంకర్ మీద రుద్దుతున్న పవన్ కళ్యాణ్

Jyothi
Published on: 3 Feb 2023 12:06 PM IST
Harish Shankar Getting Frustrated by Pawan Kalyan
X

పవన్ కళ్యాణ్ వల్ల ఫ్రస్ట్రేట్ అవుతున్న హరీష్ శంకర్

Harish Shankar: ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమా తో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ కు "గబ్బర్ సింగ్" వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన హరీష్ శంకర్ ఇప్పుడు మరొక అదిరిపోయే స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారని తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా విషయంలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ వల్ల చాలా ఫ్రస్టేషన్ కు గురవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కోసం హరీష్ శంకర్ తన సొంత స్క్రిప్ట్ ని తీయాలని అనుకున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అది ఒప్పుకోకుండా హరీష్ శంకర్ మీద తన ఐడియాలను రుద్దుతున్నారని తెలుస్తోంది. కేవలం ఫస్ట్ హాఫ్ కి మాత్రం హరీష్ శంకర్ రాసుకున్న కథ వాడమని, సెకండ్ హాఫ్ కోసం తేరి సినిమాని అడాప్ట్ చేసుకుని కథ రాయమని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కు చెబుతున్నారట. మరోవైపుకు "తేరీ" సినిమా రీమేక్ వద్దు అని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా హరీష్ శంకర్ ను ట్రోల్ చేస్తున్నారు. పైగా ఇప్పటికే "తేరీ" సినిమా తెలుగులో "పోలీసోడు" అనే టైటిల్ తో డబ్ అయ్యి విడుదలైంది. అంతేకాకుండా మంచి విజయాన్ని కూడా సాధించింది.

ఇప్పుడు అదే కథ ను మళ్ళీ పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దానికంటే ఒక మంచి ఒరిజినల్ స్క్రిప్ట్ తో సినిమా తీస్తే బాగుంటుందని అభిమానులు తెలియజేస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన "గద్దల కొండ గణేష్" సినిమా కూడా తమిళ్లో సూపర్ హిట్ అయిన "జిగర్తాండ" సినిమాకి రీమేకే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఒక ఒరిజినల్ స్క్రిప్ట్ ని తీసుకురమ్మని అభిమానులు గోల చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story