పవన్ కళ్యాణ్ సినిమా కోసం టైటిల్ మార్చిన హరీష్ శంకర్

*పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ సినిమా టైటిల్ అది కాదా?

Jyothi
Updated on: 11 Dec 2022 8:31 PM IST
Harish Shankar Changed the Title For Pawan Kalyan Movie
X

పవన్ కళ్యాణ్ సినిమా కోసం టైటిల్ మార్చిన హరీష్ శంకర్

Tollywood: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో "గబ్బర్ సింగ్" అనే సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముందుగా ఈ సినిమా కి "భవదీయుడు భగత్ సింగ్" అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పుడు ఈ సినిమా కి మరొక టైటిల్ ను ప్రకటించిన చిత్ర బృందం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అయితే టైటిల్ విషయంలో పర్వాలేదు అనుకున్న అభిమానులు ఫస్ట్ లుక్ విషయంలో మాత్రం ఏమాత్రం శాటిస్ఫై అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. "పవన్ కళ్యాణ్ ఇన్ అండ్ యాజ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సారి ఎంటర్టైన్మెంట్ అంతకు మించి ఉంటుంది. షూటింగ్ అతి త్వరలోనే మొదలు అవుతుంది," అంటూ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

అయితే పోస్టర్ ఏమాత్రం బాగోలేదని ఆఖరికి ఫ్యాన్ మేడ్ పోస్టర్ లు కూడా ఇంతకంటే బాగుంటాయి అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ సినిమా విడుదల కు ముందు ప్రమోషన్ల విషయంలో కొంచెం హడావిడి చేయాల్సిందే. విడుదల కు ముందే సినిమా పై బజ్ పెరగాల్సిన అవసరం ఉంది. మరి ఇకపై విడుదల అయ్యే ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story