Harish - Pawan: పవన్ కళ్యాణ్ అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్న హరీష్ శంకర్

admin1
Updated on: 13 Aug 2021 1:30 PM IST
Harish Shankar Announced The Special Look of Pawan Kalyan New Movie on His Birthday
X

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan- Harish Shankar: "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" మరియు "అయ్యప్పనుమ్ కోషియుమ్" రీమేక్ లతో బిజీగా ఉన్నారు. తనకు "గబ్బర్ సింగ్" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హరీష్ శంకర్ అభిమానులకు ఒక ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన స్పెషల్ లుక్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

నిజానికి వీటికి సంబంధించిన ఫోటో షూట్ నువ్వు పవన్ కళ్యాణ్ కి ఎప్పుడో పూర్తి చేశారు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల వాటిని విడుదల చేయడం కుదరలేదు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వాటిని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story