Harihara Veeramallu Movie: హరిహర వీరమల్లు విషయంలో ఆందోళనగా ఉన్న నిర్మాతలు

Harihara Veeramallu Movie: హరిహర వీరమల్లు విషయంలో ఆందోళనగా ఉన్న నిర్మాతలు

Sriveni Erugu
Published on: 24 Jan 2022 1:44 PM IST
Harihara Veeramallu Movie  Team Facing Financial Difficulties
X

హరిహర వీరమల్లు విషయంలో ఆందోళనగా ఉన్న నిర్మాతలు

Harihara Veeramallu Movie: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఐదు విభిన్న భాషల్లో విడుదల కాబోతూ పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియన్ సినిమా కానుంది. ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

పలు కారణాల వల్ల ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో చిత్ర నిర్మాత ఏ.ఎం రత్నం లోన్ ఇంట్రెస్ట్ లు కట్టుకోలేక ఇబ్బందులు పడి పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇన్ని రోజులు ఆలస్యం కావడంతో బడ్జెట్ కూడా రెండు వందల కోట్లకు చేరినట్లు సమాచారం. దీంతో నిర్మాతలకి కంగారు మొదలైంది. ప్యాన్ ఇండియన్ అయినప్పటికీ ఈ సినిమాకి అనుకున్నంత రేంజ్ లో హైప్ రావడం లేదు. దీనికి కారణం క్రిష్ "కొండపోలం" ఫ్లాప్ అవ్వడం కూడా అయ్యుండొచ్చు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత సినిమా సినిమా హిట్ అవుతుందో లేదా అంటూ కంగారు పడుతున్నారు అని తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story