Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‎కు అదిరిపోయే అప్ డేట్.. హరి హర వీరమల్లు కొత్త విడుదల తేదీ వచ్చేసిందోచ్

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‎కు అదిరిపోయే అప్ డేట్.. హరి హర వీరమల్లు కొత్త విడుదల తేదీ వచ్చేసిందోచ్
x
Highlights

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది హరి హర వీరమల్లు మూవీ టీమ్. ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. పవన్...

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది హరి హర వీరమల్లు మూవీ టీమ్. ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. పవన్ అభిమానులతోపాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ , జ్యోతిక్రిష్ణ దర్శకత్వంలో ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. రెండు భాగాలుగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నట్లు టీమ్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర బ్రుందం తాజాగా ప్రకటించింది.

మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను షేర్ చేసింది. ఇందులో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ ఇద్దరూ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ఈ పోస్టర్ తో టీమ్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షుల కూడా చెప్పింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories