Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

Hari Hara Veera Mallu
x

Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

Highlights

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా గత గురువారం భారీ అంచనాలతో విడుదలైంది. తొలి రోజు అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా థియేటర్లకు తరలివచ్చారు.

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా గత గురువారం భారీ అంచనాలతో విడుదలైంది. తొలి రోజు అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా థియేటర్లకు తరలివచ్చారు. కానీ, హరి హర వీర మల్లు సినిమా అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. సినిమాలోని ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్, కథ, స్క్రీన్‌ప్లే అన్నీ కూడా నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ నటిస్తున్న సినిమాకు ఇలాంటి వాటిని వాడతారా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హరి హర వీర మల్లు సినిమా విడుదల కావడానికి ముందే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని థియేటర్లలో టికెట్ ధరలను పెంచారు. అంతేకాకుండా, ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతి పొంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా ముందస్తు ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ప్రీమియర్ షో టికెట్ ధర ఏకంగా రూ.800-900 వరకు ఉంచగా, చాలా చోట్ల రూ.500కి పైగానే విక్రయించారు. ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించి సినిమా చూసిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "ఇంత చెత్త సినిమా తీయడమే కాకుండా, ప్రజల నుంచి డబ్బు దోచుకోవడానికి ప్రీమియర్ షోలు పెట్టి, ఒక్కో టికెట్‌కు రూ.800-900 వసూలు చేశారు. తాము ఎలాంటి సినిమా తీశారో చిత్రబృందానికి ముందే తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు, తొలి మూడు రోజుల్లోనే పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా టికెట్ ధరలు పెంచారు. టికెట్ ధరలు పెంచినప్పుడు, దానికి తగ్గట్టుగా మంచి సినిమా ఇవ్వాలి" అని ఆవేశంగా వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో కూడా సినిమాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా చూసిన చాలా మంది, ఇందులో ఉపయోగించిన నాసిరకం వీఎఫ్‌ఎక్స్ గురించి ఫిర్యాదు చేశారు. సెకండాఫ్ పై కూడా చాలా మంది నిరాశ వ్యక్తం చేశారు. కథ ఏదో ఒక విధంగా సాగుతుండగా, పవన్ తన సౌలభ్యం కోసం కథను మలుచుకున్నాడని కొందరు విమర్శించారు. మొత్తానికి, సినిమా వసూళ్లు కేవలం రెండు రోజుల్లోనే సింగిల్ డిజిట్ పడిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories