Akkineni Nagarjuna: రూ.3500కోట్లకు అధిపతి.. అక్కినేని నాగార్జున ఆస్తుల చిట్టా వింటే షాకవ్వాల్సిందే..!

Happy Birthday Nagarjuna A Glimpse into the Actors Rs 3500 Crore Empire
x

Akkineni Nagarjuna: రూ.3500కోట్లకు అధిపతి.. అక్కినేని నాగార్జున ఆస్తుల చిట్టా వింటే షాకవ్వాల్సిందే..!

Highlights

Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున నేడు (ఆగస్టు 29) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున నేడు (ఆగస్టు 29) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అనేక మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాగార్జునకు ఇప్పుడు 66 సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా ఆయన చాలా ఫిట్‌గా, అందంగా ఉన్నారు. కాగా, నాగార్జున భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటులలో ఒకరు. ఆయన ఆస్తులు, లగ్జరీ వస్తువుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నాగార్జున ఆస్తుల వివరాలు

నాగార్జున నికర ఆస్తి విలువ సుమారు రూ. 3,500 కోట్లుగా అంచనా వేయబడింది. 1986లో విడుదలైన విక్రమ్ సినిమాతో నాగార్జున చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. వెండితెరపై మాత్రమే కాకుండా, బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కు ఆయన వ్యాఖ్యాతగా ఉన్నారు.

అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోను నాగార్జున నిర్వహిస్తున్నారు. అలాగే, హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో ఆయనకు ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి. సినిమాల గురించి విద్యను అందించే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఉంది. జూబ్లీ హిల్స్‌లోని ఆయన ఇంటి విలువ రూ. 50 కోట్లు. అలాగే, ఆయన ఫిల్మ్ స్టూడియో విలువ రూ. 200 కోట్లుగా ఉంది.

నాగార్జున కార్ల కలెక్షన్

నాగార్జున వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఆయన గ్యారేజ్‌లో బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (రూ. 1.5 కోట్లు), ఆడి ఏ7 (రూ. 90.5 లక్షలు), బీఎమ్‌డబ్ల్యూ ఎం6 (రూ. 1.76 కోట్లు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటితో పాటు ఆయనకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటులలో షారుక్ ఖాన్ (రూ. 6,000 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా, రూ. 3,500 కోట్ల ఆస్తులతో అక్కినేని నాగార్జున మూడవ స్థానంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

సినిమా, ఇతర ఆదాయాలు

నాగార్జున ఒక్కో సినిమాకు రూ. 20-30 కోట్లు తీసుకుంటారు. బిగ్ బాస్ వ్యాఖ్యాతగా కూడా ఆయన భారీగా సంపాదిస్తారు. సినిమాలతో పాటు క్రీడలపైనా నాగార్జునకు ఆసక్తి ఉంది. అందుకే ఆయన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ అనే జట్టును కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం నాగార్జున నటించిన రెండు సినిమాలు కుబేర, కూలీ విడుదలయ్యాయి. కూలీ సినిమాలో ఆయన పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories