Hanu Raghavapudi: బడా ప్రొడక్షన్​హౌస్​లో హను రాఘవపూడి సినిమా​​..

* మైత్రి క్యాంపులో చేరిన సీతారామం డైరెక్టర్

Dhatripriya
Published on: 3 March 2023 12:33 PM IST
Hanu Raghavapudi Making Movie With Big Production Banner
X

పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా చేస్తున్న సీతారామం డైరెక్టర్ 

Hanu Raghavapudi: "అందాల రాక్షసి" వంటి సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమైన హను రాఘవపూడి "కృష్ణ గాడి వీర ప్రేమ గాధ" సినిమాతో కూడా బాగానే మెప్పించారు. ఆ తరువాత హను రాఘవపూడి దర్శకత్వం వహించిన "లై" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన "పడి పడి లేచే మనసు" సినిమా కూడా భారీగానే ఫ్లాప్ అయింది.

ఇక హను రాఘవపూడి కరియర్ ముగిసిపోయినట్లే అని అనుకుంటున్నా సమయంలో "సీతారామం" సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చారు హను రాఘవపూడి. దుల్కర్ సల్మాన్ మరియు మృనాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో మాత్రమే కాక అన్ని భాషల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. చాలాకాలం తర్వాత టాలీవుడ్ లో ఈ రేంజ్ లో హిట్ అయినా ప్రేమ కథ చిత్రం గా ఈ సినిమా రికార్డు సృష్టించింది.

బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా తరువాత హను రాఘవపూడి ఎలాంటి సినిమా తీస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హను రాఘవపూడి ఇప్పుడు ఒక బడా ప్రొడక్షన్ హౌస్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హను రాఘవపూడి ఒక సినిమా చేయబోతున్నారట. ఇప్పటికే హను రాఘవపూడి మైత్రి వారికి కథ వినిపించారట. ఇక సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story