"సీతారామం" సినిమా సక్సెస్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్న హను రాఘవపూడి

Hanu Raghavapudi: "సీతారామం" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదేనా?

Jyothi
Published on: 12 Sept 2022 8:41 AM IST
Hanu Raghavapudi is Going to Start his Dream Project with the Success of the movie Sitaramam
X

"సీతారామం" సినిమా సక్సెస్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్న హను రాఘవపూడి 

Hanu Raghavapudi: "సీతారామం" సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి. అసలు 'పడి పడి లేచే మనసు" వంటి డిజాస్టర్ సినిమా తీసింది ఇతనేనా అని అభిమానులు సైతం ఖంగుతినేలాగా "సీతారామం" సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి ఎలాంటి సినిమా తీయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్మాతలు సైతం హను రాఘవపూడి ముందు క్యూ కడుతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం హను రాఘవపూడి తన తదుపరి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బానర్లో చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. "సీతారామం" సినిమా లాగానే ఇది కూడా ఒక పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. నిజానికి ఇది హను రాఘవపూడి డ్రీమ్ ప్రాజెక్టు కూడా అని సమాచారం. ఇప్పటిదాకా ఒక సూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత ప్రేక్షకులు తన సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి సినిమా తీయాలని హను రాఘవపూడి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారట. ఈ సినిమా తీయాలని ఆలోచన హను రాఘవపూడి కి ఎప్పటినుంచో ఉందట. తాజాగా "సీతారామం" సినిమా హిట్ అవడంతో ఇక తన డ్రీం ప్రాజెక్టును కూడా మొదలుపెట్టేద్దామని నిర్ణయించుకున్నారు హను రాఘవపూడి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Jyothi

Jyothi

Next Story