రష్మీక మందన్న కెరీర్ బెస్ట్ రోల్ ఇదేనట...

Rashmika Mandanna: ప్రస్తుతం రష్మిక మందన్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది...

Shireesha
Updated on: 2 May 2022 9:30 PM IST
Hanu Raghavapudi Comments on Rashmika Mandanna | Tollywood Gossips
X

రష్మీక మందన్న కెరీర్ బెస్ట్ రోల్ ఇదేనట...

Rashmika Mandanna: ప్రస్తుతం రష్మిక మందన్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకవైపు టాలీవుడ్ లో మాత్రమే కాక మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ భామ. మిషన్ మజ్ను, గుడ్బై సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా డైరెక్షన్లో "యానిమల్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరోవైపు తెలుగు లో "సీతారామన్" అనే సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక మందన్న. "మహానటి" సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో తెలుగు డెబ్యూ నమోదు చేయబోతున్నారు. ఇది ఒక యుద్ధం బాక్ డ్రాప్ లో జరిగే సినిమా కథని దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

అలాగే వీరిద్దరి మధ్య ప్రేమ కథ కూడా చాలా అందంగా ఉండబోతోందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డైరెక్టర్. మృణాళిని తాకుర్, రష్మిక మందన్న ఈ సినిమాలో హీరయిన్లుగా నటిస్తున్నారు. రష్మిక ఈ సినిమాలో అఫ్రీన్ అనే ఒక కాశ్మీరీ ముస్లిం పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా కోసం రష్మిక మందన్న చాలా కష్టపడింది అని, తన పాత్ర చాలా అందంగా ఉండబోతోందని, రష్మిక కెరీర్ లో ఇదే బెస్ట్ రోల్ అని రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించాడు హను రాఘవపూడి.

Shireesha

Shireesha

Next Story