విలన్ గా మారిన అల్లు అర్జున్ హీరోయిన్

విలన్ గా మారిన అల్లు అర్జున్ హీరోయిన్
x
Highlights

ఎప్పుడో 12 ఏళ్ల క్రితం 'దేశముదురు' అనే సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన మిల్కీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం...

ఎప్పుడో 12 ఏళ్ల క్రితం 'దేశముదురు' అనే సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన మిల్కీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో తన నటనతో అందరిని మెప్పించిన హన్సిక తెలుగు తమిళ భాషల్లో చాలా మంది హీరోలతో నటించింది. గత కొంతకాలంగా తమిళ సినిమాలతో బిజీగా ఉన్న హన్సిక ఇన్నాళ్ళకు మళ్ళీ తెలుగులో కనిపించబోతుందని, అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా ద్వారా ఈమె రీఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ తన తదుపరి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హన్సిక ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందట. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ కాదు. హన్సిక పాత్రకు ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. అంటే ఆమె విలన్ పాత్రలో కనిపించబోతోంది. విలన్ పాత్ర అయినప్పటికీ తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత మరియు కథ బాగా నచ్చడంతో హన్సిక ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా తరువాత అయినా హన్సికకి మరిన్ని అవకాశాలు దొరుకుతాయో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories