Gautham Menon: గౌతమ్ మీనన్ కి షాక్ ఇచ్చిన నిర్మాతలు

*గౌతమ్ మీనన్ అబద్ధాలు చెబుతున్నాడు అంటున్న నిర్మాణ సంస్థ

admin1
Published on: 5 Nov 2021 3:00 PM IST
GVM Studios Producers Shocks to Director Gautham Vasudev Menon with First Look Poster
X

గౌతమ్ మీనన్ కి షాక్ ఇచ్చిన నిర్మాతలు

Gautham Vasudev Menon: "ఘర్షణ", "ఏ మాయ చేసావే", "ఎటో వెళ్ళిపోయింది మనసు" వంటి సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా టైటిల్ "అంబు సెల్వన్" అని, సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. నటుడు విష్ణు విశాల్ మరియు డైరెక్టర్ పా రంజిత్ కూడా ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉండగా గౌతమ్ మీనన్ ఇప్పుడు అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చారు.

"ఇది చాలా షాకింగ్ గా ఉంది. నేను ఏ సినిమాలో అయితే నటిస్తున్నాను అని అంటున్నారో ఆ సినిమా గురించి కూడా నాకు తెలీదు. ఆ డైరెక్టర్ ని నేను ఎప్పుడూ కలవను కూడా కలవలేదు. ఇలాంటివి చాలా ఈజీగా చేయొచ్చు అని తెలియడం ఇంకా భయంకరంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు గౌతమ్ మీనన్. అయితే గౌతమ్ ఇలా ట్వీట్ చేసిన వెంటనే జీవీఎమ్ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్ తమ యూట్యూబ్ ఛానల్ లో గౌతమ్ మీనన్ మరియు వివేక్ ప్రసన్న కలిసి ఒక నటించిన ఒక సన్నివేశం యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తున్నారని సినిమాలో నిజంగానే గౌతమ్ నటించారు అంటూ ఆ బ్యానర్ ప్రకటించింది. ఈ వీడియో గురించి గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతారో ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story