Guttu Chappudu: 'గుట్టుచప్పుడు' ఫస్ట్ లుక్..హీరోగా ప్రముఖ యాక్టర్ కొడుకు

Guttu chappudu Movie
x

Guttu Chappudu first look 

Highlights

Guttu Chappudu:: టాలీవుడ్ ఇండస్ట్రీలో వార‌సుల‌కు కొద‌వలేదు. టాలెంట్ ఉన్న‌వాళ్లు నెగ్గుకొస్తున్నారు.

Guttu Chappudu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వార‌సుల‌కు కొద‌వలేదు. టాలెంట్ ఉన్న‌వాళ్లు నెగ్గుకొస్తున్నారు. ప్రేక్ష‌కులు ఆద‌రించ‌పోతే ఒక‌టి రెండు సినిమాల‌తో సైడైపోయిన వారు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో న‌టుడి వార‌సుడు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ప్రముఖ యాక్టర్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ప్రస్తుతం సంజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గుట్టుచప్పుడుస‌. ఓ పిట్టకథ మూవీతో డెబ్యూ అయినటువంటి సంజయ్ రావు.. ఈ సినిమాతో సోలో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సంజయ్ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్బంగా మేకర్స్ సినిమా నుండి సంజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ తో పాటుగా ఒకేసారి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంజ‌య్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌రికొందరూ ద‌ర్శ‌క నిర్మాత‌ల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేశాడు. టెక్నీషియన్స్ కూడా ఈ కార్య‌క్రమంలో. ముందుగా హీరోగా సంజయ్ మాట్లాడి.. 'అందరికి థాంక్స్ చెప్పాడు. అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ తో పాటు తమ చిత్రం గురించి మాట్లాడి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని' తెలిపాడు. ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న సొసైటీలో నేటి యువతీయువకులు ఎలా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారనే సామాజిక పరిస్థితులను ప్రస్తావిస్తూ.. లవ్, యాక్షన్ , రొమాన్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు.

ఈ సినిమాకు మణింద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాలో నటాషా సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఫస్ట్ లుక్ చూస్తే రఫ్ లుక్కులో హీరో సంజయ్ చొక్కా లేకుండా కూర్చొని ఓ చేతిలో సిగరెట్ పట్టుకొని.. మరో చేతికి గొలుసు చుట్టుకొని చాలా భీకరంగా కనిపిస్తున్నాడు.. ఈ గుట్టుచప్పుడు సినిమాకు హరి గౌర సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్షన్ మూవీగా వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంజ‌య్ ని ప్రేక్ష‌కులు ఎంతమేర ఆద‌రిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories