Guduputani Movie: సప్తగిరి హీరోగా 'గూడుపుఠాణి', త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

Guduputani Movie Trailer has a Good Response | Telugu Cinema News Today
x

గూడుపుఠాణి సినిమా (ఫైల్ ఫోటో)

Highlights

* గ్రామీణ నేపథ్యంలో సాగే కథ * కథానాయికగా నేహా సోలంకి పరిచయం * త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

Guduputani Movie: తెలుగు తెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్స్, ఆ తరువాత హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాంటివారి జాబితాలో బ్రహ్మానందం, అలీ, సునీల్ తరువాత ఇప్పుడు సప్తగిరి కనిపిస్తున్నాడు. ఆల్రెడీ సప్తగిరి హీరోగా కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గూడుపుఠాణి' రూపొందింది. శ్రీనివాస రెడ్డి - రమేశ్ యాదవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, కె. ఎమ్. కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో నేహా సోలంకి కథానాయికగా పరిచయమవుతోంది. కుంచె రఘు విలన్ గా నటించిన ఈ సినిమా నుంచి నిన్న రాత్రి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఒక ప్రేమజంట చుట్టూ తిగిగే కథ ఇది. ఆ గ్రామంలో ప్రతినాయకుడి కారణంగా వాళ్లకి ఎదురయ్యే అవరోధాలు వాళ్లు ఎలా అధిగమించారనేదే ఈ కథ. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories