ఇదో వెరైటీ.. స్మశానంలో దెయ్యంతో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్!

ఇదో వెరైటీ.. స్మశానంలో దెయ్యంతో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్!
x
Highlights

ఓ సినిమాని ఇంతవరకు ఎవ్వరు కూడా చేయని వినూత్న రీతిలో స్మశానంలో దెయ్యం చేత విడుదల చేశాం.. సినిమా ,టైటిల్ లోగోని, కాన్సెప్ట్ లుక్ పోస్టర్‌ని లాంచ్ చేసినప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా ప్రమోషన్స్ అనేవి రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నారు దర్శకనిర్మాతలు.. తాజాగా GST అనే పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చాలా డిఫరెంట్‌ గా లాంచ్ చేశారు మేకర్స్.. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను స్మశానంలో దెయ్యంతో విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాని తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్‌పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు జానకి రామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ సినిమాని ఇంతవరకు ఎవ్వరు కూడా చేయని వినూత్న రీతిలో స్మశానంలో దెయ్యం చేత విడుదల చేశాం.. సినిమా ,టైటిల్ లోగోని, కాన్సెప్ట్ లుక్ పోస్టర్‌ని లాంచ్ చేసినప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. ప్రతి మనిషి ఎక్కడ పుట్టి ఎలా బతికినా చివరికి వచ్చేది మాత్రం స్మశానంలోకే కదా.. మరి అలాంటి స్మశానాన్ని ఒక అపవిత్ర స్థలంగా భావిస్తూ ఎందుకు భయపడుతారు. మంచి కార్యానికి దేవాలయాలను పవిత్ర స్థలాలుగా భావించినప్పుడు, స్మశానాలను పవిత్ర స్థలంగా ఎందుకు భావించకూడదు? అందుకే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇక్కడ రిలీజ్ చేసినట్టుగా జానకి రామ్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories