Gowtam Tinnanuri: "అది నా కల కూడా" అంటున్న రామ్ చరణ్ డైరెక్టర్

Gowtam Tinnanuri: రామ్ చరణ్ ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే...

Shireesha
Published on: 18 March 2022 11:13 AM IST
Gowtam Tinnanuri Dream is to Do Movie with Ram Charan | Tollywood News
X

Gowtam Tinnanuri: "అది నా కల కూడా" అంటున్న రామ్ చరణ్ డైరెక్టర్

Gowtam Tinnanuri: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చ్ 25 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

జెర్సీ వంటి సూపర్ హిట్ సినిమాని ప్రేక్షకులకు అందించిన గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఒక రామ్ చరణ్ అభిమాని గౌతమ్ తిన్ననూరి కి ట్వీట్ చేశారు.

"అన్నా మంచి సినిమా తియ్యు అన్నా చరణ్ అన్న క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి" అని అభిమాని గౌతమ్ తిన్ననూరి కి ట్వీట్ చేయగా డైరెక్టర్ కూడా దీనికి రిప్లై ఇచ్చారు. "నా బెస్ట్ నేను ఇస్తాను. నా సాయశక్తులా ప్రయత్నించి చేయగలిగింది చేస్తాను. ఇది నా కల కూడా" అని చెప్పుకొచ్చారు గౌతమ్ తిన్ననూరి. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఇప్పటికే పలు పుకార్లు వినిపించాయి కానీ వాటి గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు, నటీనటుల గురించి త్వరలో తెలియనుంది.

Shireesha

Shireesha

Next Story