Govinda : ఆమె కారణంగా విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ సీనియర్ హీరో

Govinda and Sunita Ahujas Marriage on the Brink of Divorce!
x

Govinda : ఆమె కారణంగా విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ సీనియర్ హీరో 

Highlights

Govinda : ఆమె కారణంగా విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ సీనియర్ హీరో

Govinda : బాలీవుడ్ నటుడు గోవింద గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. గోవింద మరాఠీ నటితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల గోవింద నుండి విడిపోవాలని ఆయన భార్య సునీత అహుజా నిర్ణయించుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు సునీత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే, గోవింద విచారణకు హాజరు కాలేదని చెబుతున్నారు. గోవింద తనను మోసం చేశారని, బాధ పెట్టారని సునీత ఆరోపించారు.

కోర్టులో సునీత పిటిషన్

విడాకుల పుకార్లపై సునీత అహుజా ఇటీవల తన వ్లాగ్‌లో ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు కొత్త సమాచారం ప్రకారం, సునీత బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. 'ప్రేమ, వివాహంలో మోసం, బాధ, విడిపోవడం' ఆధారంగా ఆమె గోవింద నుండి విడాకులు కోరారు. హిందూ వివాహ చట్టం, 195 ప్రకారం సెక్షన్ 13 (1) (i), (ia), (ib) కింద సునీత ఈ పిటిషన్ వేశారు. కోర్టు మే 25న గోవిందకు సమన్లు పంపింది. విచారణ సమయంలో సునీత సకాలంలో కోర్టుకు హాజరయ్యారు, కానీ గోవింద హాజరు కాలేదు. దీంతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది.

మరాఠీ నటితో సాన్నిహిత్యమే కారణమా?

ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవింద, సునీత అహుజా మధ్య నిరంతర భేదాభిప్రాయాలు, డిఫరెంట్ లైఫ్ స్టైల్ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. గోవిందకు ఒక 30 ఏళ్ల మరాఠీ నటితో ఉన్న సాన్నిహిత్యమే వారి విడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే, ఆరు నెలల క్రితం వారు విడాకులకు దరఖాస్తు చేసుకున్నా, ఇప్పుడు వారు మళ్లీ కలిసి ఉండాలని యోచిస్తున్నారని వారి లాయర్ చెప్పారు. అంతేకాకుండా, తన భర్తను తన నుండి ఎవరూ దూరం చేయలేరని సునీత నిరంతరం చెబుతూ వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories