సాయి పల్లవిపై చేసిన పోస్ట్ నన్ను తీవ్రంగా కలిచివేసింది.. గవర్నర్ తమిళిసై కామెంట్స్ వైరల్..

Governor Tamilisai Soundarajan Slams Viral Post on Sai Pallavi
x

సాయి పల్లవిపై చేసిన పోస్ట్ నన్ను తీవ్రంగా కలిచివేసింది.. గవర్నర్ తమిళిసై కామెంట్స్ వైరల్..

Highlights

Tamilisai Soundarajan: శ్యామ్ సింగరాయ్ సినిమా లో దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tamilisai Soundarajan: శ్యామ్ సింగరాయ్ సినిమా లో దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే దేవదాసి పాత్రలో సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక వార్త ప్రచురించగా.. దానిపై పెద్దయెత్తున వివాదం చెలరేగింది. ఓ టాలెంటెడ్ నటిపై బాడీ షేమింగ్‌‌ చేయడం మంచి పద్ధతి కాదని చాలామంది ఖండించారు.

తాజాగా ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. సాయిపల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలకు పాల్పడటం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె పేర్కొన్నారు. ఓ తమిళ ఛానల్‌‌తో మాట్లాడిన తమిళసై తాను కూడా తన రూపం పట్ల చాలాసార్లు ట్రోలింగ్‌కు గురయ్యానన్నారు. అయితే అలాంటి వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎగతాళి చేసేవారికి ఎదుటి వారి భాద తెలియదని తానూ చాలా బాధపడ్డా కానీ ప్రతిభ, శ్రమతో వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్వయానా ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories