Ramabanam: వివాదంలో గోపిచంద్ నటించిన రామబాణం సినిమా పాట.. ఆ పాట నాదే అంటూ జానపద గాయకుడు..

Ramabanam: ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాట వాడేశారు

Jyothi
Published on: 27 April 2023 3:29 PM IST
Gopichand Starrer Ramabanam Song in Controversy
X

Ramabanam: వివాదంలో గోపిచంద్ నటించిన రామబాణం సినిమా పాట.. ఆ పాట నాదే అంటూ జానపద గాయకుడు..

Ramabanam: గోపిచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట ప్రేక్షకులని బాగా అలరించింది. ఇందులో నా ప్రాణం ఆగదే పిల్ల.. అనే లైన్ ఉంది. తాజాగా కరీంనగర్ కు చెందిన జానపద గాయకుడు గొల్లపల్లి రవీందర్ ఈ పాట నాదే, ట్యూన్ నాదే అంటూ మీడియా ముందుకు వచ్చారు.

తాను గత 30 ఏళ్లుగా పాటలు పాడుతున్నానని. 1992లో చేతికి గాజులు పిల్లో.. అనే పాట రాశానని చెబతున్నారు. అప్పట్లో ఆ పాట బాగా హిట్ అయిందని అంటున్నారు. ఆ పాటలోని లైన్‌ని, ట్యూన్‌ని రామబాణం యూనిట్ వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. మూడు రోజుల్లోగా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చిత్ర యూనిట్ కానీ దీనిపై తనకు వివరణ ఇవ్వాలి లేకపోతే లీగల్ గా వెళ్తానంటున్న గొల్లపల్లి రవీందర్‌.

Jyothi

Jyothi

Next Story