Seetimaarr Collections : అనుకున్న విజయాన్ని సాధించలేకపోయిన "సీటీమార్"

* అంతంతమాత్రంగా వసూలు చేసిన గోపీచంద్ సినిమా

admin1
Updated on: 15 Sept 2021 2:32 PM IST
Gopichand Seetimaarr Movie Average Collections in Box Office
X

"సీటీమార్" 

Seetimaarr Collections : వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న గోపీచంద్ తాజాగా ఇప్పుడు "సీటీమార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కబడ్డీ బ్యాక్ డ్రాప్తో సాగుతుంది. గోపీచంద్ మరియు తమన్నా ఇద్దరు ఈ సినిమాలో మహిళా కబడ్డీ టీం కోచ్ లుగా కనిపిస్తారు. ఈ మధ్యనే సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్ డే రోజునే మూడు కోట్ల షేర్ వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక వీకెండ్ శని ఆదివారాలు కూడా ఈ సినిమా కలెక్షన్లకు బాగానే ఉపయోగపడ్డాయి.

కానీ అనుకున్న విధంగానే సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. తాజాగా ఈ చిత్ర కలెక్షన్లు ఉన్నట్టుండి చాలా ఎక్కువగా పడిపోయాయి. సినిమా కేవలం యావరేజ్ టాక్ సంపాదించడంతో సినిమా కలెక్షన్లు అంతగా బాలేదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా థియేట్రికల్ కలెక్షన్లు మహా అయితే 13 కోట్ల వరకు చేరతాయని కానీ కనీసం బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా చేరే సూచనలు లేవు అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెద్దగా కాంపిటేషన్ కూడా ఏమీ లేనప్పటికీ "సీటీమార్" సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.

admin1

admin1

Next Story