Top
logo

Seetimaar​ Teaser: గోపీచంద్‌ 'సీటీమార్‌'టీజర్‌ రిలీజ్

Seetimaar​ Official Teaser
X

 'సీటీమార్‌' టీజర్ రిలీజ్ 

Highlights

Seetimaar​ Teaser: గోపీచంద్ ప్రధానపాత్రలో సంప‌త్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీటీమార్‌'.

Seetimaar​ Official Teaser: గోపీచంద్ ప్రధానపాత్రలో సంప‌త్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీటీమార్‌'. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న సిటీమార్ లో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టించారు. ఈ సినిమాలో ఆంధ్ర మహిళల క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్ కనిపించనున్నారు. ‌త‌మ‌న్నాతెలంగాణ మహిళల క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుద‌లైన ఫస్ట్ లుక్స్‌ పోస్టర్ కు మంచి స్పందన వ‌చ్చింది.

పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందుతోంది. మెలొడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సినీయర్ నటి భూమిక చావ్లా కీల‌క పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని దర్శకనిర్మాతలు ప్రకటించారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సిటీమార్' చిత్రాన్ని స‌మ్మర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌ చేయనున్నారు. ఈ మూవీలో సూర్యవంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీలక పాత్రలు పోషించారు.


Web TitleGopichand Seetimaar​ Movie Official Teaser Released
Next Story