Gopichand: "ప్రభాస్ లాగే నేను కూడా మారుతున్నాను" అంటున్న గోపీచంద్

Gopichand: "ప్రభాస్ లాగే నేను కూడా మారుతున్నాను" అంటున్న గోపీచంద్

Rama Rao
Updated on: 15 Jun 2022 6:30 PM IST
Gopichand Says I am Changing Like Prabhas | Tollywood News
X

Gopichand: "ప్రభాస్ లాగే నేను కూడా మారుతున్నాను" అంటున్న గోపీచంద్ 

Gopichand: విలన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన గోపీచంద్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోలలో ఒకరిగా మారిపోయారు. మ్యాచో స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ తన కెరియర్లో ఇప్పటికే యజ్ఞం, ఆంధ్రుడు, లక్ష్యం, రణం, గోలీమార్, లౌక్యం వంటి సినిమాలతో మంచి హిట్ లను అందుకున్నారు. గత కొంత కాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమైన గోపీచంద్ తాజాగా ఇప్పుడు "పక్కా కమర్షియల్" అనే ఒక ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గోపీచంద్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం తనకు నచ్చదని తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేటుగా ఉంచితేనే తనకి ఇష్టమని అన్నారు. ఇక తన మొదటి సినిమా జయం కు 11,000 రెమ్యూనరేషన్ అందుకున్నానని చెప్పిన గోపీచంద్ "పక్కా కమర్షియల్" సినిమాకి కెరీర్లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన స్నేహితుడు ప్రభాస్ కూడా తనలాగే ఇంటర్వ్యూలు ఎక్కువగా ఎక్కువ మాట్లాడరని కానీ ఇప్పుడు ప్రభాస్ మారినట్టే తను కూడా కొంచెం మారుతూ ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు గోపీచంద్.

Rama Rao

Rama Rao

Next Story