Gopichand: బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోపీచంద్ రామబాణం

Gopichand: బడ్జెట్ ఇబ్బందుల్లో గోపీచంద్ సినిమా

Dhatripriya
Published on: 17 March 2023 6:12 PM IST
Gopichand Ramabanam Is Facing Difficulties In Terms Of Budget
X

Gopichand: బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోపీచంద్ రామబాణం

Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొద్ది రోజులుగా డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. 2022 లో పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించిన గోపీచంద్ ఆ సినిమాతో కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. తాజాగా ఇప్పుడు గోపీచంద్ తన తదుపరి సినిమా "రామబాణం" పైన తన ఆశలన్నీ పెట్టుకున్నారు. "రామ రామ కృష్ణ కృష్ణ" ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

గతంలో గోపీచంద్ మరియు శ్రీనివాస్ కాంబినేషన్లో "లక్ష్యం" మరియు "లౌక్యం" సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్లో ముందుకు రాబోతున్న మూడవ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. పైగా టైటిల్ చూస్తే కూడా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి మరియు యువతకి కూడా నచ్చే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ ప్రస్తుతం బడ్జెట్ పరంగా సినిమా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయిపోయిందని తెలుస్తోంది.

ఇక డైరెక్టర్ శ్రీనివాస్ ఇప్పటికే మూడున్నర గంటల సినిమా తీసాడట. ఫుటేజ్ కూడా బాగా పెరిగిపోయిందని ఇందులో కనీసం గంట సినిమా కత్తెర వేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఎడిటర్ కి ఇది చాలా పెద్ద పని అని చెప్పుకోవచ్చు. సినిమా హిట్ అయితే రన్ టైం అంతా నెగిటివ్ పాయింట్ అవ్వకపోవచ్చు కానీ సినిమా కనీసం యావరేజ్ గా ఉన్నా అందరూ రన్ టైం వేలెత్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విషయంలో చిత్ర బృందం ఏం చేస్తుందో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story