క్రేజీ ఆఫర్.. బాల‌య్య‌తో హిట్టు కొడితే.. మ‌హేష్‌తో!

Gopichand Malineni to Direct Mahesh Babu Movie
x

క్రేజీ ఆఫర్.. బాల‌య్య‌తో హిట్టు కొడితే.. మ‌హేష్‌తో!

Highlights

Mythri Movie Makers Big Offer: ఈరోజుల్లో చిన్న హీరోలు కూడా మంచి హిట్ సినిమాలు అందుకుని పెద్ద హీరోల దృష్టిలో పడుతున్నారు.

Mythri Movie Makers Big Offer: ఈరోజుల్లో చిన్న హీరోలు కూడా మంచి హిట్ సినిమాలు అందుకుని పెద్ద హీరోల దృష్టిలో పడుతున్నారు. ఉదాహరణకు "గీత గోవిందం" సినిమా బ్లాక్ బస్టర్ చూసి సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ప‌ర‌శురామ్ తో సినిమాకి సైన్ చేశారు. ఒక్క పెద్ద హిట్టు ప‌డితే చాలు టాలెంట్ ఉన్న కొత్త ద‌ర్శ‌కుల‌తో కూడా స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. "క్రాక్" తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక్క టీజ‌ర్ కూడా ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

అయినప్పటికీ సినిమాపై బ‌జ్ మాత్రం మామూలుగా లేదు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని బాల‌య్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మ‌రో పెద్ద హిట్ అవ్వడం ఖాయ‌మ‌ని కూడా చెప్పేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ఈ సినిమాపై గ‌ట్టిగా నమ్మకం పెట్టుకున్నారు అని తెలుస్తోంది. బ‌డ్జెట్ విష‌యంలో కూడా గోపీచంద్ కి పెద్ద ఆఫ‌ర్ ఇచ్చారట. ఈ సినిమా హిట్టు అయితే మ‌హేష్‌ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఇస్తామని మైత్రీ వారు డీల్ చెప్పారట. ఇక మ‌హేష్ కూడా డేట్లు ఇవ్వ‌డానికి రెడీ అనే సమాచారం. మ‌హేష్ కి క‌థ నచ్చి, బాల‌య్య తో సినిమా హిట్టు అయితే మైత్రీ వారు మహేష్ - గోపీచంద్ సినిమాని నిర్మించడానికి రెడీ అన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories