ఇంటర్వల్ సన్నివేశంతో అభిమానులతో విజిల్స్ వేయించనున్న గోపీచంద్ మలినేని

Gopichand Malineni Receives Applause With Interval Scenes
x

ఇంటర్వల్ సన్నివేశంతో అభిమానులతో విజిల్స్ వేయించనున్న గోపీచంద్ మలినేని

Highlights

NBK 107: ఈ మధ్యనే బోయపాటి దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ..

NBK 107: ఈ మధ్యనే బోయపాటి దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ తాజాగా ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలయ్య కోసం ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ స్క్రిప్ట్ ని రాసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు #ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకక్కుతున్న ఈ సినిమా టైటిల్ పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అయితే ఈ సినిమా కోసం "జై బాలయ్య" అనే టైటిల్ ను అనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

సినిమా మొత్తంలో ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఫ్లాష్ బాక్ సన్నివేశాలు కచ్చితంగా అభిమానులు విజిల్స్ వేసేలా ఉంటాయట. ఒక పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇంటర్వెల్ సన్నివేశం నుంచి సినిమా పూర్తయ్యేదాకా అభిమానులు విజిల్స్ వేస్తూనే ఉండేలా ఉంటుంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయింది. సినిమా విడుదల తేది గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories