Balakrishna: బాలయ్య కోసం రంగంలోకి ఆ హీరోయిన్?

Gopichand Malineni Contacted Trisha Krishnan for Nandamuri Balakrishna Next Movie
x

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (ఫొటో ట్విట్టర్)

Highlights

Balakrishna: బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం 'అఖండ'.

Balakrishna: బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం 'అఖండ'. ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వీరి కాంబోలో మూడో సినిమాగా రానున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్‌ లో ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ను పూర్తయ్యాక దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 'క్రాక్' సినిమాతో రవితేజకు సూపర్ హిట్ అందించిచాడు ఈ డైరెక్టర్. అయితే, బాలయ్య సినిమాకు ప్రధానంగా అందరు డైరెక్టర్లు ఎదుర్కొనే సమస్య హీరోయిన్స్ అంట. ప్రస్తుతం ఈ గండంలో చిక్కుకున్నాడంట గోపిచంద్ మలినేని. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా ఎంచుకునేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడంట. అయితే, త్రిష ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది.

మరోవైపు, ఈ చిత్రంలో మీనా కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిసిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories