Gopichand: మూడవసారి ఆ డైరెక్టర్ తో చేతులు కలపనున్న గోపీచంద్

Gopichand: మాచో స్టార్ గోపీచంద్ మరియు డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాలు బయటకు వచ్చాయి..

admin1
Updated on: 27 Dec 2021 4:16 PM IST
Gopichand Joining Hands with Director Sriwass for Third Time | Tollywood New Movie Updates
X

Gopichand: మూడవసారి ఆ డైరెక్టర్ తో చేతులు కలపనున్న గోపీచంద్

Gopichand: మాచో స్టార్ గోపీచంద్ మరియు డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాలు బయటకు వచ్చాయి. మొదటి సినిమా "లక్ష్యం" ఒక ఫ్యామిలీ డ్రామాగా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకోగా వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా "లౌక్యం" కూడా కమర్షియల్ గా హిట్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరిద్దరు మూడవసారి చేతులు కలపడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ త్వరలోనే మరొక సినిమా చేయబోతున్నారు. గోపీచంద్ కెరియర్లో 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఈ మధ్యనే అధికారికంగా లాంచ్ చేశారు. ముహూర్తం షాట్ కి వివి వినాయక్ క్లాప్ కొట్టగా టీజీ వెంకటేష్ కెమెరా ఆన్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమా డైరెక్టర్ తనకి గోపీచంద్ కి మధ్య మంచి స్నేహం ఉందని వారిద్దరూ ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారని అందుకే ఆ రెండు సినిమాలు హిట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. మరి గోపీచంద్ కి ఈ సినిమా ఎంతవరకు హిట్ ఇస్తుందో చూడాలి.

admin1

admin1

Next Story