Akhanda: బాల‌య్య అభిమానుల‌కు గుడ్ న్యూస్

Good News to Bala Krishna Fans From Akhanda
x

అఖండ మూవీ 

Highlights

Akhanda: 15 నుంచి 20 రోజుల పాటు షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. దీంతో షూటింగు పార్టు మొత్తం పూర్తవుతుందని అంటున్నారు

Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'అఖండ. గ‌తంలో బాల‌య్య‌- బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూప‌ర్ హిట్ సాధించాయి. వీరి ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ‌. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబందిచిన టైటిల్ రోర్, బాల‌య్య లుక్ సినిమాపై అంచ‌నాల‌ను పీక్స్ తీసుకెళ్లాయి. ఈ మూవీ చెందిన ఏ అప్ డేట్ వ‌చ్చినా అభిమానులు పండ‌గ చేసుకుటున్నారు. తాజాగా ఈ సినిమా సంబంధిచిన తాజా అప్ డేట్ వ‌చ్చింది.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా 15 నుంచి 20 రోజుల పాటు షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. దీంతో షూటింగు పార్టు మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో ఆ కాస్త చిత్రీకరణను పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ మే 28 వతేదీన విడుదల కావాల్సింది. కరోనా కారణంగా అన్ని సినిమాలు వాయిదా పడడంతో ఈ సినిమా విషయంతో సందీగ్థం నెలకొంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చాడు.

ఈ మూవీకి సంబంధించిన టైటిల్ రోర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్య హిస్టరీ క్రియేట్ చేశారు. బాలయ్య నటించిన అఖండ టైటిట్ రోర్ య్యూటూబ్‌లో కేవలం 16 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే 50మిలియన్ వ్యూస్ సాధించిన సౌత్ ఇండియాన్ మూవీస్ లోనే టాప్ 2లో నిలిచింది. కేజీఎఫ్ మూవీ తర్వాత స్థానంలో బాలయ్య టైటిల్ రోల్ నిలవడం విశేషం. బాలయ్య తర్వాత యంగ్ హీరోలు, అల్లుఅర్జున్, తమిళ హీరో విజయ్, జూ. ఎన్టీఆర్ టీజర్స్ నిలిచాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories