Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ మీకు గుడ్ న్యూస్..లైన్ లో బాహుబలి3..

Good News For Darling Fans Baahubali 3 Is In Line
x

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ మీకు గుడ్ న్యూస్..లైన్ లో బాహుబలి3..

Highlights

Prabhas: ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే రెడీ ఔతున్నాయి.

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కాంబినేషన్ లో ఆదిపురుష్ చేస్తున్నాడు. రామాయణం ఆధారంగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కానుంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలిభాగం చిత్రీకరణ ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K...2024 సంక్రాంతి లక్ష్యంగా రెడీ ఔతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రాజెక్ట్ Kను 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. వీటికి తోడు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీని ప్రభాస్ అనౌన్స్ చేసుకున్నాడు..

ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే రెడీ ఔతున్నాయి. రాజా డీలక్స్ మినహా అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఈ మధ్యే విడుదలైన రాధేశ్యామ్, అంతకు ముందు వచ్చిన సాహో కూడా పాన్ ఇండియా చిత్రాలే. ప్రభాస్ ఇలా పాన్ ఇండియా చిత్రాలే చేయడానికి కారణం బాహుబలి సిరీస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1, 2 చిత్రాలతో ప్రభాస్ పాన్ వరల్డ్ ఇమేజ్ దక్కించుకున్నాడు. బాహుబలి సిరీస్ తో వచ్చిన ఇమేజ్ కారణంగానే ప్రభాస్ ను పాన్ ఇండియా సబ్జెక్ట్ లు వెతుక్కుంటూ వచ్చి వరిస్తున్నాయి. ఇదిలాఉంటే తనతో బాహుబలి చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియాతో ప్రభాస్ మరో సినిమా చేసేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలతో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవలే బాహుబలి ప్రొడ్యూసర్స్ తో భేటీ అయ్యాడు. ఆర్కా మీడియా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డతో సుదీర్ఘంగా మంతనాలు జరిపాడు. ఈ మీటింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. వీరు సమావేశం అయింది బాహుబలి3 గురించా లేక మరో ప్రాజెక్ట్ గురించా అని ఇండస్ట్రీ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. మరోవైపు ఓ సినిమా గురించి ఆర్కా మీడియా నిర్మాతలు చర్చించారని..ప్రాజెక్ట్ వివరాలు విన్న ప్రభాస్ అంగీకారం చెప్పాడని టాక్ వినిపిస్తుంది. ఏదిఏమైనా, ఇది కార్యరూపం దాల్చితే ప్రభాస్ కెరీర్ లో మరో భారీ చిత్రం కావడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories